KRNL: ఎమ్మిగనూరులో వేతనాలు పెండింగ్ పెట్టడం మున్సిపల్ కార్మికులపై అన్యాయమని ఇవాళ సీఐటీయు నాయకులు విమర్శించారు. పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు ప్రజలకు కీలక సేవలు అందిస్తున్నారని అన్నారు. ధరల పెరుగుదల మధ్య వేతనాలు ఆలస్యం కావడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్చి నెల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.