ATP: కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనరసమ్మ (47) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆమెను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. భర్త మరణంతో నాలుగేళ్ల కిందట ఆమె ఈ ఉద్యోగంలో చేరారు. ఆమె మృతిపట్ల అధికారులు సంతాపం తెలిపారు.