నెల్లూరు హరనాథపురం సర్కిల్లో ఏర్పాటు చేసిన సూర్య నమస్కార ప్రతిమలను మంత్రి నరాయణ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సిటీ, రూరల్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వాటర్ ఫౌంటైన్, వాకింగ్ ట్రాక్‌తో కూడిన ఆధునిక పార్కును త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.