HNK: విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ పరిధిలోని తరాలపల్లి గ్రామానికి బెల్లం చైత్ర ఇంటర్లో 463/470 మార్కులు సాధించిన నేపథ్యంలో చైత్రను మాజీ ఎమ్మెల్యే సన్మానించారు. భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి ఉన్నత స్థానంలో ఉండాలని, తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.