KDP: ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన CM చంద్రబాబును ఒంటిమిట్ట TTD గెస్ట్ హౌస్లో బద్వేల్ TDP ఇంఛార్జ్ రితీష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను CM దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు రితీష్ రెడ్డి పేర్కొన్నారు.