అన్నమయ్య: తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి వస్తున్న బీటెక్ విద్యార్థి ధనుష్(22) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం స్నేహితుడి బైక్‌పై బెంగళూరు రోడ్డులోని మడికాయల శివాలయం వద్దకు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన ధనుష్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.