SDPT: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువత ఉపాధికి గొప్ప వేదికని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులని, శిక్షణ కాలంలో వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువత వెంటనే ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.