కోనసీమ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం అసహ్యకరమని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి హానికరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్లో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.