KRNL: మాజీ సీఎం జగన్పై ఆదివారం మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ గురించే మాట్లాడేవారికి క్రెడిబిలిటీ లేదన్నారు. ‘వైసీపీ హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వీడాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత ఉంది. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జగన్ వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.