ప్రకాశం: అక్రమంగా ఓటర్స్‌ను తొలగించారని తిరిగి ఆ ఓటర్స్‌ను చేర్చాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పీ రాజబాబును వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్లో కలెక్టర్‌ను పార్టీ శ్రేణులు, రైతులు మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.