ASR: డుంబ్రిగూడ ఎస్సై ఎల్. సురేష్ అరమ పంచాయతీ పరిధిలోని అరమ, నడిమివలస గ్రామాల్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై ప్రజలకు వివరించారు. మహిళల రక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి విధించిన శిక్షలను వివరించారు. వాహనాలు జాగ్రత్తగా నడపాలని, ప్రమాదాల నివారణలో బాధ్యత వహించాలని సూచించారు.