NLR: నెల్లూరు విద్యుత్ భవన్ లో సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించబడుతుందని 0861-2320427 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం తెలిపారు. ఇవాళ వినియోగదారులు తమ సమస్యలను తెలియజేసి పరిష్కారాలు పొందాలని సూచించారు.