E.G: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ‘పల్లె పండుగ 2.0 – ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. విద్య, వైద్యం, భూమి, రోడ్లు, నీటి సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.