శ్రీకాకుళం: నరసన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 5వ తేదీన జరుగుతుందని, 11 పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని, పదో తరగతి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులన్నారు.