టీ. నర్సాపురం మండలం బొర్రంపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.వైద్యాధికారి డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో బాలికలకు ,మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలను పంపిణీ చేశారు.భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని అన్నారు.