TG: రాష్ట్ర ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ‘మిలియన్ మార్చ్’కు ఇవాళ్టితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి హరీష్ రావు నాటి పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ట్యాంక్ బండ్పై ఆత్మగౌరవం ఉప్పొంగిన ఆ స్ఫూర్తి నేటికీ సజీవమన్నారు. మన వనరుల దోపిడీని అడ్డుకోవడానికి, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదే స్ఫూర్తితో మళ్లీ సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.