జగిత్యాల జిల్లాలోని పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఫోన్ఇన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. ఈ నెల 13 వరకు నిర్వహించనున్న ఈ ఫోన్ఇన్ ప్రోగ్రాంకు సబ్జెక్టు నిపుణులు 18 మంది టీచర్లను నియమించినట్లు పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులు తమ సందేహాల నివృత్తి కోసం 9:45 గంటల నుంచి 4.15 గంటల వరకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.