VKB: తాండూర్ డిపో నుంచి జీవన్గి గ్రామానికి నడిచే ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సిన బస్సు, 5:45 గంటలకు వస్తోందని, దీనివల్ల పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డ్రైవర్లు నిర్ణీత సమయానికి బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.