AP: లోక్‌సభను ఓం బిర్లా బాగా నడిపిస్తున్నారని, ఆయన వ్యవహార శైలి ఎన్నో ఏళ్లుగా చూస్తున్నామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ‘ఆయన హయాంలో అనేక బిల్లులపై సానుకూల చర్చలు జరిగాయి. ప్రజల దృష్టి మళ్లించేందుకే అవిశ్వాస తీర్మానం పెట్టారు. లోక్‌సభలో ప్రధానిని అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారు. సభ లోపల, బయట ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ సభ్యుల వైఖరి ఉంది’ అంటూ మండిపడ్డారు.