KMM: కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సీల్ తీసి ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతను పరిశీలించారు. అనంతరం గోడౌన్‌కు తిరిగి సీల్ వేయించి.. సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.