MDCL: అల్వాల్ సర్కిల్ ఓల్డ్ అల్వాల్‌లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాల ఆహ్వాన పత్రికను మంగళవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా తిరుకళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.