AP: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. CBSE కార్యాలయానికి 80 సెంట్లు, తళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు, APSIRDకి 5 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే సచివాలయం HOD టవర్ల పనులకు రూ.2,316 కోట్లు, తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి రూ.119 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.