TPT: సీతమ్మ నగర్ మహిళా యూనివర్సిటీ కూడలిలోని సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద ఆమె 129వ వర్ధంతి సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.