PDPL: జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో జరుగుతున్న యోగానంద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర, కళ్యాణోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, పురోహితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆయన వెంట పాల్గొన్నారు.