W.G: ప్రతిరోజు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని వాకర్ ఇంటర్నేషనల్ సభ్యులు వడుపు గోపి, బోండాడ శ్రీరామ్ అన్నారు. మంగళవారం వీరవాసరం జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నడక ప్రయోజనాలపై వాకర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 5 నిమిషాల పాటు సున్నితమైన వేగంతో ప్రారంభించి, తగిన వేగంతో స్థిరంగా నడవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.