MBNR: బాలానగర్ మండలం చెన్నంగుల గడ్డ తండాలో సర్పంచ్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించారు. 5వ వార్డులో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు, పారిశుద్ధ్య మెరుగుదలకు బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ కార్యక్రమంలో ఏఈ చంద్రశేఖర్, కార్యదర్శి చంద్రలేఖ, వార్డు సభ్యులు పాల్గొని గ్రామాభివృద్ధిపై చర్చించారు.