జిల్లాలో ఈ నెల 24న జరగనున్న APRS CAT, APRJC & DC CET 2026 పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత ఆదేశించారు. ఇందుకోసం నాలుగు కేంద్రాలు సిద్ధం చేశామని, సీటింగ్, త్రాగునీరు, విద్యుత్, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకి సూచించారు. ప్రశ్నపత్రాల రవాణా జాగ్రత్తగా చేయాలని, ప్రతి కేంద్రంలో వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు.