SKLM: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు తాడి రాజేశ్‌ను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిస్టులు సమాజానికి అవసరమని పేర్కొంటూ, రాజేశ్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.