ATP: జిల్లా కోర్టుకు నేడు మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా ఈ హెచ్చరిక పంపినట్లు కోర్టు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాంబు స్క్వాడ్ సహాయంతో న్యాయస్థాన ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. పదేపదే ఇలాంటి బెదిరింపులు వస్తుండటంతో న్యాయవాదులు, సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.