KDP: వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లె హరిజనవాడలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వృద్ధులు,దివ్యాంగులు, ఒంటరి మహిళలకు స్వయంగా పింఛన్లు అందజేశారు.అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.