KMM: రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేం నరేందర్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం, నిబద్ధత తెలంగాణ గళాన్ని దేశ రాజధానిలో బలంగా వినిపించాలని ఆకాంక్షించారు.