W.G: నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్వీయ గణన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ.. సాంకేతికతను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.