E.G: డీ లిమిటేషన్కు మద్దతు ఇచ్చిన వారు ఆంధ్ర ద్రోహులు అని ఏపీ ప్రత్యక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పెద్ద కుట్ర వేసిందన్నారు. ఈ బిల్ పాస్ అయితే దేశంలో విభజన రావచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.