BPT: చీరాల రూరల్ పోలీసులు జూద స్థావరాలపై ఆదివారం దాడులు నిర్వహించారు. ఎస్సైకి అందిన పక్కా సమాచారం మేరకు తోటవారిపాలెం గ్రామ శివారు కుండేరు వాగు వద్ద జూదం ఆడుతున్న వారిపై దాడులు చేశారు. ఈ క్రమంలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.5,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.