శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస మీదుగా పాలకొండ వెళ్లే బస్సుల్లో విద్యార్థులు ఫుట్ బోర్డుల పై వేలాడుతూ ప్రయాణించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కళాశాలలు ముగిసే సమయానికి తగిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.