E.G: నిడదవోలులో ఈ నెల 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. జిల్లాలో సీఎం పర్యటన విజయవంతం అయ్యేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు.