ATP: బొమ్మణహల్లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.