అన్నమయ్య: మదనపల్లి విజయభారతి పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌ను ఎమ్మెల్యే షాజహాన్ భాష మంగళవారం సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. చిన్నతనం నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంపొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత చల్లపల్లి నరసింహారెడ్డి, డాక్టర్ ఎన్. సేతు తదితరులు పాల్గొన్నారు.