VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం కలక్టరేట్లో రిజిస్ట్రేషన్, రవాణా, గనులు, ఎక్సైజ్, అటవీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ప్రతి శాఖకు కేటాయించిన ఆదాయ లక్ష్యాలను సాధించాలన్నారు.