తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అధ్యక్షతన జరగనుంది. మొత్తం 87 అంశాలపై చర్చించనున్నారు. నూతన అదనపు అన్నదాన భవనం ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చిన అంశం, టీటీడీ విద్యాసంస్థలకు రూ.116 కోట్లు, అలాగే రూ.5700 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించనున్నారు.