మార్కాపురం జిల్లా కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం పల్లకి సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ పులి శాంతి, గోవర్ధన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.