NDL: ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురం గ్రామంలో ఈనెల 11వ తేదిన జరిగిన హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోస్సా తెలిపారు. ఇవాళ ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు కు వెళ్లే రహదారి లో ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆమె వివరించారు.