SKLM: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలంటూ ఇవాళ నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణ దాస్ సమక్షంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో యువ నేత కృష్ణ చైతన్య, ఎంపీపీ ఏ మురళి బైరాగి నాయుడు, బగ్గు రామకృష్ణ, పలువురు నేతలు పాల్గొన్నారు.