కృష్ణా: యువత క్రీడల్లో రాణించి దివిసీమ ఖ్యాతి పెంచాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కోడూరులో ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఆయన ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ప్రోత్సహించారు. నిర్వాహకుడు బచ్చు వెంకటేష్, జనసేన నాయకులు పాల్గొన్నారు.