ELR: ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబుకు వడదెబ్బ తగిలింది. వెల్లమిల్లి గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేసే క్రమంలో ఆయన పాల్గొన్న సందర్భంలో ఇది చోటుచేసుకొంది. వడదెబ్బతో వాంతులు చేసుకొని నీరసించి పోయారు. ప్రాథమిక చికిత్సలు చేసి ఆయనను ఇంటికి పంపారు. ఎంపీడీవో మనోజ్, సూపర్డెంట్ ఆంజనేయ బాబు, మరో డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.