KRNL: మంత్రాలయం మండలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. CPI నాయకుడు భాస్కర్ యాదవ్, CPM మండల కార్యదర్శి హెచ్. జయరాజు సీఐ దస్తగిరి బాబుకు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఎమ్మిగనూరు -తుంగభద్ర ఫోర్‌లైన్ రోడ్డుపై అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.