AKP: గొలుగొండ మండలం పుత్తడిగైరంపేట పంచాయతీ శివారు గ్రామమైన పలపునాగేంధ్రపాలెం వద్ధ మాకిరెడ్డి వెంకటరమణ వ్యవసాయ భూముల్లో 8 భారీ వృక్షాలను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నరికివేసి చోరీ చేశారు. వృక్షాలు చోరీకి గురైన సంఘటన తెలుసుకున్న వెంకటరమణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. వేప, నేరేడు, మామిడి మొదలగు చెట్లు చోరీ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసాడు.