సత్యసాయి: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కదిరి ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, రోడ్డు భద్రత చర్యలు, పెండింగ్ కేసుల పరిష్కారం వంటి అంశాలపై మంత్రి సమగ్రంగా చర్చించారు.