VZM: అరకులోయకు ముఖద్వారంగా ఉన్న బొడ్డవర పంచాయతీ పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త అడుగు పడింది. రోహిత్ వెంకట సాయి కంచర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంసీఆర్ మల్టీ కుషన్ హెలికాప్టర్ రెస్టారెంట్‌ను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇవాళ ప్రారంభించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇలాంటి వినూత్న ప్రయత్నాలు ఎంతో అవసరమన్నారు.