ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. శనివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అరికెపూడి గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.